ఘనంగా నైజీరియా స్వాతంత్య్ర దినోత్సవం

Nigeria grand celebrations Independence Day in india

ఉత్సాహంగా పాల్గొన్న ఇంజినీరింగ్‌ విద్యార్థులు

తూర్పుగోదావరి, మారేడుమిల్లి (రంపచోడవరం) : మండలంలోని జలతరంగిణి జలపాతం వద్ద ఆదివారం నైజీరియా దేశం 57వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆ దేశ యువతీయువకులు అదివారం ఘనంగా జరుపుకొన్నారు. రాజానగరం గైట్, సూరంపాలెం అదిత్య, శ్రీప్రకాష్‌తోపాటు పలు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదువుతున్న  నైజీరియా దేశానికి చెందిన పలువురు అక్టోబర్‌ ఒకటో తేదీని తమ దేశానికి స్వాతంత్య్ర వేడుకలను మారేడుమిల్లిలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారంతా  ఇక్కడికి వచ్చారు. సుమారు 50 మంది యువత ఆట పాటలతో  జలపాతంలో కేరింతలు కొట్టారు. అనంతరం వారి దేశ జాతీయ గీతాన్ని పాడుతూ కేక్‌ కట్‌ చేశారు.

Back to Top