
అబుజా: ఉత్తర-మధ్య నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. వంద మందితో ప్రయాణిస్తున్న పడవ నీట మునగడంతో 60 మంది మృతి చెందారు. మలాలే జిల్లాలోని తుంగన్ సులే నుండి బయలుదేరిన ఈ పడవ గౌసావా కమ్యూనిటీ సమీపంలో ఒక చెట్టు మొద్దును ఢీకొనడంతో బోల్తా పడింది. స్థానిక ప్రభుత్వ ప్రాంత చైర్మన్ అబ్దుల్లాహి బాబా అరా మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతున్నదన్నారు. పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 60 కి చేరిందని తెలిపారు. పది మంది పరిస్థితి విషమంగా ఉందని, గల్లంతైన వారి కోసం వెదుకులాట జరుగుతున్నదన్నారు.
Twenty-nine people died after a boat carrying passengers sank in north-central Nigeria, AFP reported on Wednesday, citing rescuers. https://t.co/d6ZEFKTAP2
— Reuters Africa (@ReutersAfrica) September 3, 2025
షాగుమి జిల్లా అధికారి సాదు ఇనువా మొహమ్మద్ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే తాను సంఘటన స్థలానికి చేరుకున్నానని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో వందమంది ప్రయాణిస్తున్నారన్నారు. తొలుత 31 మృతదేహాలను వెలికితీశారన్నారు. గల్లంతైనవారి కోసం అత్యవసర సిబ్బంది వెదుకుతున్నారని నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. ఇప్పటివరకు 50 మందిని రక్షించారని తెలిపింది. పడవ ఓవర్‌లోడ్ అయి చెట్టు మొద్దును ఢీకొట్టిందని, దీంతో అది బోల్తా పడి, ప్రమాదం జరిగిందని ఏజెన్సీ తెలిపింది. నైజీరియాలో, ముఖ్యంగా వర్షాకాలంలో భద్రతా లోపాలు, సరైన నిర్వహణలేని ఓడల వాడకం కారణంగా పడవ ప్రమాదాలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది.