త్వరలో నూతన మద్యం విధానం: కొల్లు రవీంద్ర | New Excise policy in Andhra Pradesh, says Kollu Ravindra | Sakshi
Sakshi News home page

త్వరలో నూతన మద్యం విధానం: కొల్లు రవీంద్ర

Aug 30 2014 1:51 PM | Updated on Jun 2 2018 5:00 PM

త్వరలో బీసీ కమిషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

గుంటూరు: త్వరలో బీసీ కమిషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఏపీ ఎక్సైజ్ , చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శనివారం గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మంగళగిరి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చేనేత రుణాలు ఎన్ని కోట్లున్నా రద్దు చేస్తామన్నారు. ఏపీ రాజధానిపై అందరి ఆమోదంతోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్వరలో నూతన మద్యం విధానాన్ని ప్రకటిస్తామని కొల్లు రవీంద్ర చెప్పారు.  అంతకుముందు శ్రీలక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. శ్రీగంగా భ్రమరాంబ, మల్లేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement