ముగిసిన సీఎం జగన్‌, ముకేష్‌ అంబానీ భేటీ | MukesH Ambani Meets AP CM YS Jagan | Sakshi
Sakshi News home page

ముగిసిన సీఎం జగన్‌, ముకేష్‌ అంబానీ భేటీ

Feb 29 2020 4:19 PM | Updated on Feb 29 2020 6:14 PM

MukesH Ambani Meets AP CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ భేటీ ముగిసింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఈ సమావేశం జరిగింది. దాదాపు గంటన్నర పాటు సీఎం జగన్‌తో అంబానీ బృందం చర్చలు జరిపింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై వీరు చర్చించినట్టు సమాచారం. ఈ  సమావేశంలో అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్‌ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిమళ్‌నత్వానీ పాల్గొన్నారు. అంతకు ముందు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గన్నవరం  ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ముకేశ్‌ అంబానీ బృందానికి స్వాగతం పలికారు. 

Advertisement
 
Advertisement
Advertisement