అదీ బాబు మైండ్ గేమ్‌లో భాగమే... | Sakshi
Sakshi News home page

అదీ బాబు మైండ్ గేమ్‌లో భాగమే...

Published Tue, Feb 23 2016 1:26 AM

అదీ బాబు మైండ్ గేమ్‌లో భాగమే... - Sakshi

ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అవుతుండటంతో పాలుపోని చంద్రబాబు ఏపీలోని ప్రజల దృష్టి మరల్చేందుకు మైండ్‌గేమ్ ఆడుతున్నారని విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఎంఎల్‌సీ కోలగట్ల వీరభద్రస్వామి వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే పలు చానెళ్లలో పదిమంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేయించుకుంటున్నారని చెప్పారు. సోమవారం సాయంత్రం ఆయన సాక్షితో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో పీఎసీ చైర్మన్‌గా ఉన్న భూమా నాగిరెడ్డి ఎందుకు పార్టీ మారుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

ఆయన వెళ్లడంవల్ల సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్కసారిగా పీఎం అయిపోలేరనీ, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డికి ఎటువంటి నష్టం వాటిల్లదనీ పేర్కొన్నారు. కేవలం ఉనికిని కాపాడుకునేందుకే చంద్రబాబు ఈ డ్రామాలాడుతున్నారు.  జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement