సచివాలయంలో బుద్ధా వెంకన్న ఓవరాక్షన్‌ | MLC buddha venkanna over action in ap secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయంలో బుద్ధా వెంకన్న ఓవరాక్షన్‌

Oct 10 2017 2:14 PM | Updated on Aug 18 2018 8:27 PM

MLC buddha venkanna over action in ap secretariat - Sakshi

ఏపీ సచివాలయంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హడావిడి చేశారు.

సాక్షి, అమరావతి: ఏపీ సచివాలయంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హడావిడి చేశారు. నిబంధలనకు విరుద్ధంగా సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం బుద్ధా ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు పబ్లిసిటీ సెల్‌ లో ప్రెస్‌ మీట్‌లకు అనుమతి లేదని ఐ అండ్‌ పీఆర్‌ అధికారులు తెలిపారు.

కేవలం మంత్రులు మాత్రమే మీడియా సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతి ఉందన్నారు. కానీ అలాంటి నిబంధనలేవి పట్టించుకోని ఆయన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అనుమతి లేకుండా ప్రెస్‌ మీట్‌ పెట్టడంపై మీడియా ప్రతినిధులు బుద్ధా వెంకన్నను ప్రశ్నించారు. దానిపై స్పందించిన ఆయన సచివాలయం.. కమిషనర్‌ దా అంటూ.. ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement