ఎమ్మెల్యే చెవిరెడ్డికి గాయాలు | MLA chevireddy injuries | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే చెవిరెడ్డికి గాయాలు

Oct 9 2014 1:57 AM | Updated on Aug 13 2018 4:11 PM

ఎమ్మెల్యే చెవిరెడ్డికి గాయాలు - Sakshi

ఎమ్మెల్యే చెవిరెడ్డికి గాయాలు

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు.

తిరుపతి: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు.  బుధవారం పాకాల మండలం బయనపల్లెలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే కారులో బయలుదేరారు. బయనపల్లె సమీపంలో అడ్డొచ్చిన అడవిజంతువు వీరి వాహనం ఢీకొని అదుపు తప్పిన ఎదురుగా వస్తున్న కర్ణాటక వాసుల వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కర్ణాటక వాసుల వాహనం పల్టీ కొట్టడంతో అందులోని ఏడుగురికి గాయాలయ్యాయి.

యపడిన కర్ణాటక వాసులను ఎమ్మెల్యే చెవిరెడ్డి తమ సొంత వాహనంతో పాటు 108 అంబులెన్స్‌లో చిత్తూరు ఆసుపత్రికి పంపించారు.  అనంతరం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. దాని తరువాత చిత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కర్ణాటక వాసులను ఎమ్మెల్యే చెవిరెడ్డి పరామర్శించారు. వారి వైద్య ఖర్చులను ఆయనే చెల్లించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement