నాటుకు ఘాటెక్కువ | mirchi have a high demand in the market | Sakshi
Sakshi News home page

నాటుకు ఘాటెక్కువ

Mar 10 2017 7:10 PM | Updated on Oct 1 2018 2:09 PM

జిల్లాలో సాధారణంగా గతేడాదితో పోలిస్తే ఈసారి మిరపసాగు విస్తీర్ణం పెరిగింది.

ఓ రకానికి ధర ఉంది.. అయితే దిగుబడి లేదు. మరో రకం ధర బాగా తగ్గిపోయింది. ఇది ప్రస్తుతం మిర్చి రైతుల పరిస్థితి. గతేడాది మిర్చి క్వింటా ధర సుమారు రూ.15 వేలకు పెరగడంతో చాలామంది రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపారు. అయినా వారికి ఒరిగిందేమీ లేదు.
 
► మార్కెట్‌లో క్వింటా ధర రూ.25 వేలు
►  అయితే గణనీయంగా తగ్గిన దిగుబడి
►  హైబ్రిడ్‌ రకాల ధరలు పతనం
 
గూడూరు : జిల్లాలో సాధారణంగా గతేడాదితో పోలిస్తే ఈసారి మిరపసాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది సాగు 2,145 హెక్టార్లు కాగా ఈ సంవత్సరం సుమారు 3000 హెక్టార్ల పైచిలుకే సాగు చేపట్టారు. గూడూరు, ఓజిలి, చిల్లకూరు, పెళ్లకూరు, బాలాయపల్లి, సైదాపురం, కోట, చిట్టమూరు తదితర మండలాల్లో విస్త్రతంగా పంట సాగులో ఉంది.

పంట సాగుకు అధికంగానే ఖర్చవుతోంది. పురుగు మందులతోపాటు, కాంప్లెక్స్‌ ఎరువుల వాడకం కూడా ఎక్కువే. సాగు పూర్తయ్యే నాటికి రూ.50 వేల వరకు ఖర్చుపెట్టారు. నాటు మిరప బాగాపండితే ఎకరానికి సుమారు 15 క్వింటాళ్ల వరకు పండుతాయి. సరాసరిన 10 క్వింటాళ్లు పండినా ప్రస్తుతం ఉన్న ధరలను బట్టి ఎకరానికి రూ.2.50 లక్షలకు పైగానే ఫలసాయం వస్తుంది. దీంతో పెట్టుబడి ఖర్చులు పోను సుమారు రూ.2 లక్షల ఆదాయం రావాలి. అయితే పరిస్థితి తారుమారైంది.

ఏంటో ఈ పరిస్థితి.. ప్రస్తుతం నాటు మిర్చి ధరలకు హైబ్రిడ్‌ మిర్చి ధరలకు నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎన్నడూ లే ని విధంగా నాటు మిర్చి క్వింటా ధర రూ.25 వేలకు పైగా పలుకుతుండగా, హైబ్రిడ్‌ రకాల మిర్చి ధర గణనీ యంగా పడిపోయి క్వింటా కేవలం రూ.7 వేలు ఉంది. ఇక నాటు రకం సాగు చేసిన రైతులు దిగుబడులు అం తంత మాత్రంగా ఉండటంతో ఖర్చులకు సరిపోతుం ద ని చెబుతున్నారు. మార్కెట్‌లో నాటు రకం ఎండు మిర్చి ధర కిలోరూ.300 పలుకుతుండగా,హైబ్రీడ్‌ రకాల మిర్చి మాత్రం కిలో కేవలం రూ.100 పలుకుతోంది.ఈ తరహా లో వ్యత్యాసం ఎన్నడూ లేదని రైతులు వాపోతున్నారు.

హైబ్రీడ్‌ సాగు చేసి తీవ్రంగా నష్టపోయాం..  హైబ్రీడ్‌ రకం రెండెకరాల్లో సాగు చేస్తే రూ.1.60 లక్షలు పెట్టుబడులయ్యాయి. ధరలు చాలా తక్కువగా ఉండటంతో పెట్టుబడులైనా వస్తాయనే నమ్మకం లేకుండా పోతుంది. – నారాయణరెడి, కొండాగుంట, గూడూరు రూరల్‌ .

ధరల్లో ఇంత తేడా ఎప్పుడూ లేదు.. సుమారుగా అందరం హైబ్రీడ్‌ రకాలే ఎక్కువగా సాగు చేశాం. పెట్టుబడులు మాత్రం ఏ రకానికైనా ఒక్కటే. అయితే ధరల్లో తేడా ఈ విధంగా ఉంటుం దనుకోలేదు. పెట్టుబడులు కూడా వస్తాయనే నమ్మకం లేకుండా ఉంది. - కస్తూరయ్య, చిట్టమూరు మండలం  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement