
ఎర్రగుంట్ల : జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణరెడ్డి నియంతృత్వ పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు సుధీర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం నిడుజివ్వి గ్రామంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేవగుడి పల్లెలకు మేం పోతే ఎందుకు వెళ్లారని పోలీసులు ప్రశ్నిస్తున్నారన్నారు. మా పల్లెలకు కూడా మంత్రి ఆది వస్తే ఎందుకు ప్రశ్నించరు. ఇదేనా ప్రజాస్వామం అని అన్నారు.మంత్రి మా గ్రామాలకు వస్తే మేమే తిప్పుతాం..మేం వెళ్లినపుడు ఆయన ఇదేవిధంగా చేయగలరా అని అన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తగా జమ్మలమడుగు డీఎస్పీకి నేను ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదన్నారు.
ఈయన సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారని పేర్కొన్నారు. జమ్మలమడుగు పోలీసులు వారు తెలుగుదేశం చొక్కాలు వేసుకొని విధులు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వస్తుంటే మా గ్రామాలకు పోకుండా అడ్డుకుంటున్నారే.. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు.రంగసాయిపురంలో టీడీపీనుంచి టీడీపీలోకి మారుతున్నారన్నారు. టీడీపీలో పార్టీలో రెండు సార్లు కండువాలు వేస్తారు. వైఎస్సార్ సీపీలో ఒక్కసారి మాత్రమే వేస్తారని చెప్పారు.