
మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)
సాక్షి, శ్రీకాకుళం: జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇన్‌చార్జి మంత్రుల్లో స్వల్ప మా ర్పులు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కొడాలి నాని జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులయ్యారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి ఎన్నికైన కొడాలి నాని పౌరసరఫరాలశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలోనే ప్రస్తుతం నాణ్యమైన బియ్యం పథకం అమలవుతోంది. రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నాని గుర్తింపు పొందా రు. వెలంపల్లి శ్రీనివాస్‌ను విజయనగరం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియ మించారు.