టీడీపీ చౌకబారు రాజకీయాలు

Minister Anil Kumar Yadav Fires On Yanamala Ramakrishnudu - Sakshi

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

సాక్షి, అమరావతి: టీడీపీ చౌకబారు రాజకీయాలు చేస్తోందని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండలిలో నిన్న జరిగిన ఘటనలు దారుణమన్నారు. మండలిలో మేం ఏమైనా చేస్తామంటూ యనమల రామకృష్ణుడు మాట్లాడారని, రూల్‌ 90 నోటీసు ఒక రోజు ముందివ్వాలని చెప్పినా వినలేదని తెలిపారు. సంఖ్యా బలం ఉందని ప్రభుత్వ బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర చేసిందని ధ్వజమెత్తారు. (గడ్డంపై చర్చ: టీడీపీ ఎమ్మెల్సీకి మంత్రి కౌంటర్‌)

మండలిలో నారా లోకేష్‌ను వీడియోలు తీయొద్దని చైర్మన్ కూడా చెప్పారని, వీడియోలు తీయొద్దని  చెబితే మంత్రి వెల్లంపల్లిపై దాడి చేశారని నిప్పులు చెరిగారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని టీడీపీ యత్నించిందన్నారు.అర్ధరాత్రి వరకు సమావేశాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని, అయినా మండలిని నిరవధిక వాయిదా వేసి వెళ్ళిపోయారని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. (నాపై దాడికి లోకేష్‌ ప్రోద్బలమే కారణం)

సంప్రదాయం ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లు చివరిలో ఆమోదిస్తారని.. కానీ టీడీపీ విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. బిల్లులు ఆమోదంపై మిగతా పార్టీల అభిప్రాయం తీసుకోమన్న డిప్యూటీ చైర్మన్ తీసుకోలేదన్నారు. ద్రవ్య వినియమ బిల్లు ఆమోదం పొందకుండా కుట్రలు చేశారని దుయ్యబట్టారు. మండలిలో ఎక్కడ బూతులు మాట్లాడమో టీడీపీ నిరూపించాలన్నారు. సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది టీడీపీ సభ్యులేనన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకొని టీడీపీ సభ్యులు చరిత్రలో నిలిచిపోయారని ధ్వజమెత్తారు.

తాను సభలో జిప్‌ విప్పానంటూ లోకేష్‌, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, బాబు రాజేంద్రప్రసాద్‌ విష ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిల్‌ నిప్పులు చెరిగారు. మహిళ ఎమ్మెల్సీల ముందు తాను అసభ్యకరంగా ప్రవర్తించానని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఛైర్మన్‌ దగ్గరకు వెళ్లి వీడియోలు బయట పెట్టమని అడుగుదామని, తాను తప్పు చేసినట్లు తేలితే రాజీనామా చేస్తానని, లేకపోతే మీరు రాజీనామాకు సిద్ధమా అంటూ టీడీపీ ఎమ్మెల్సీలకు మంత్రి అనిల్‌ సవాల్‌ విసిరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top