‘అవినీతి జరిగిందని నిరూపించగలరా ?’ | Minister Alla Nani Fires On Kanna Lakshminarayana | Sakshi
Sakshi News home page

ఓర్వలేకే కుటిల రాజకీయాలు: ఆళ్ల నాని

Apr 20 2020 7:14 PM | Updated on Apr 20 2020 7:27 PM

Minister Alla Nani Fires On Kanna Lakshminarayana - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుతో కుమ్మక్కై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ బురద చల్లుతున్నారని మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పై కన్నా లక్ష్మీనారాయణ చేసిన విమర్శలను తప్పుపట్టారు. కిట్ల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని నిరూపించగలరా అంటూ కన్నాను మంత్రి ప్రశ్నించారు.

కరోనా కట్టడిలో ముందున్నాం..
‘ఏపీలో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కోసం రూ.730 మాత్రమే వెచ్చించాం. చంద్రబాబుతో కలిసి కన్నా ఏ విధంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి పనిలో ఆయన విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు, కన్నా కుటిలమైన రాజకీయాలు చేస్తున్నారని’’ ఆయన నిప్పులు చెరిగారు. కరోనా కట్టడిలో మిగిలిన రాష్ట్రాల కంటే ముందున్నామని.. తమ ప్రభుత్వం ప్రజలకు మాత్రమే జవాబుదారి అని స్పష్టం చేశారు.
(దోచుకున్న డబ్బును బయటకు తీయండి)

అత్యంత పారదర్శకంగా పాలన అందిస్తున్నాం..
‘‘ఏ రాష్ట్రమైనా మా కంటే తక్కువ ధరకు కిట్లను కొనుగోలు చేసిందా? కేంద్రం మా కంటే ఎక్కువ ధరకు కిట్లను కొనుగోలు చేసింది. కావాలనే ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేస్తున్నారని’’ దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ద్వారా మూడు సార్లు ఆరోగ్య సర్వే చేశామని.. ఏపీలో 32 వేల మంది కరోనా అనుమానితులకు లక్ష ర్యాపిడ్‌ కిట్స్‌ ద్వారా టెస్టింగ్‌ నిర్వహిస్తున్నామని  తెలిపారు. అత్యంత పారదర్శకంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు. కరోనా కట్టడికి సీఎం వైఎస్‌ జగన్‌ నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ అందిస్తోన్న మంచి పాలన చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు చేసే కుటిల రాజకీయాల్లో భాగస్వామ్యం కావొద్దని కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి ఆళ్ల నాని హితవు పలికారు.
(కష్టాల్లో ఉన్నా.. పథకాల్లో ముందుకే : వైఎస్‌ జగన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement