వైఎస్సార్‌సీపీకే మేయర్, జెడ్పీ చైర్మన్ పదవులు | Meyer, chairman of zp positions to ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకే మేయర్, జెడ్పీ చైర్మన్ పదవులు

Jun 20 2014 3:28 AM | Updated on May 29 2018 4:06 PM

వైఎస్సార్‌సీపీకే మేయర్, జెడ్పీ చైర్మన్ పదవులు - Sakshi

వైఎస్సార్‌సీపీకే మేయర్, జెడ్పీ చైర్మన్ పదవులు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకే కడప మేయర్, జెడ్పీ చైర్మన్ పదవులు లభిస్తాయని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు అన్నారు.

జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు
 సిద్దవటం:  వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకే కడప మేయర్, జెడ్పీ చైర్మన్ పదవులు లభిస్తాయని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు అన్నారు. మండలంలోని మూలపల్లె గ్రామంలో గురువారం మాజీ సర్పంచ్ ఉపాసి వెంకటసుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి చెందిన జెడ్పీటీసీలు మెజార్టీ స్థానాలలో గెలుపొందారన్నారు. 41 మంది జెడ్పీటీసీలు విజయం సాధించగా వారిలో 33 మంది క్యాంపులో ఉన్నారన్నారు. అలాగే కడప మేయర్ పదవి కూడా వైఎస్సార్‌సీపీకే దక్కుతుందన్నారు. డబ్బు, అధికార బలంతో టీడీపీ వారు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వైఎస్సార్‌సీపీకే ఈ పదవులు దక్కటం ఖాయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement