breaking news
Kadapa Mayor
-
MLA మాధవిరెడ్డికి దిమ్మతిరిగే షాకిచ్చిన కడప మేయర్ సురేష్ బాబు
-
కడప మున్సిపల్ కమిషనర్ కి నోటీసులు ఇచ్చిన మేయర్ సురేష్ బాబు
-
నా మేయర్ పదవి తొలగింపు కోసం టీడీపీ కక్ష సాధింపు రాజకీయాలు..
-
కడప మేయర్ తొలగింపుపై హైకోర్టు స్టే
సాక్షి, అమరావతి: కడప మేయర్ సురేశ్‌బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన్ని పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తొలగింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం స్టే విధించింది. కడప మేయర్(Kadapa Mayor) సురేష్ బాబుపై సంచలన ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి వరుస ఫిర్యాదులు చేశారు. ఆయన కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో.. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సురేష్ బాబును మేయర్ పదవి నుంచి ఏకపక్షంగా తొలగిస్తూ జీవో జారీ చేశారు. అయితే.. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ‘‘ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా మున్సిపల్ కమిషనర్ నోటీసు ఇచ్చారు. వీటి ఆధారంగా మేయర్‌ను డిస్ క్వాలిఫై చేశారు. కానీ, ఎమ్మెల్యే తన ఫిర్యాదును సీఎం కార్యాలయంలో ఇచ్చారు. సీఎం కార్యాలయం నోట్‌ను ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు రిఫర్ చేశారు. వివరణ ఇచ్చుకోవడానికి మేయర్ సురేష్ బాబుకు తగిన సమయం కూడా ఇవ్వలేదు. ఈలోగా ఆయన్ని డిస్క్వాలిఫై చేశారు’’ అని సురేష్ బాబు తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. కడప మేయర్ తొలగింపునపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది: సురేష్బాబున్యాయ వ్యవస్థ పై పూర్తి నమ్మకం ఉందని.. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని కడప మేయర్ సురేష్ బాబు అన్నారు. ‘‘కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుట్ర పూర్వకంగా చేసిన కుట్రలు బట్టబయలు అయ్యాయి. న్యాయస్థానం సరైన తీర్పు ఇవ్వడం సంతోషకరం. ఎప్పటికైనా వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన ఉంటుంది. కడప అభివృద్ధికి మేయర్‌గా ఎంతో కృషి చేశా. ఎమ్మెల్యే చేసిన కుయుక్తులు ఏవీ ఫలించలేదు’’ అని సురేష్ బాబు అన్నారు. ఇదీ చదవండి: ఎంత అదిరిందో బాబుగారినే అడగాలి! -
కడప మేయర్ పదవి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి : కడప మేయర్ పదవి నుంచి తనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సురేష్ బాబు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తొలగింపు ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. తన కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్కు పనులు కేటాయించాలని మునిసిపల్ కమిషనర్‌ను సురేబాబు ఒత్తిడి చేశారా? అని ప్రశ్నించిన హైకోర్టు, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.అంతకు ముందు సురేష్‌బాబు తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు సురేష్ బాబు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారని, పూర్తిస్థాయి వివరణ నిమిత్తం గడువు కోరారని కోర్టుకు నివేదించారు. అయితే ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండానే అధికారులు మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారని పేర్కొన్నారు. వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీ పిటిషనర్ కుటుంబ సభ్యులకు చెందినది కాదని వివరించారు. మునిసిపల్ కమిషనర్ నిబంధనల మేరకే నేరుగా ఆ కంపెనీకి పనులు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, సురేష్‌బాబు అధికార దుర్వినయోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. పిటిషనర్‌కు నోటీసులిచ్చి వివరణ తీసుకున్న తరువాతనే మేయర్ పదవి నుంచి తొలగించారని కోర్టుకు తెలిపారు.న్యాయమూర్తి స్పందిస్తూ మేయర్ తమ కుటుంబ కంపెనీకి పనులు కేటాయించాలని మునిపిసల్ కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చారా? అని ప్రశ్నించారు. దీనిపై పూర్తి వివరాల సమర్పణకు గడువునివ్వాలని న్యాయవాది ప్రణతి కోరారు. సురేష్‌బాబు తొలగింపు ఉత్తర్వులు అమల్లోకి వచ్చేందుకు రెండు వారాలు పడుతుందని పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి పూర్తి వివరాల సమర్పణకు గడువిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. -
మంగంపేట బైరటీస్ గనుల వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, వైఎస్ఆర్: కడప జిల్లా మంగంపేట బైరటీస్ గనుల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూములు కొల్పొయిన బాధితులు పరిహారం కోసం ఆరు గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. వీరికి మధ్దతు తెలిపేందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు ధర్నా ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది. దీంతో ధర్నా ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. -
కడప మేయర్ గృహ నిర్బంధం
-
కడప మేయర్ గృహ నిర్బంధం
కడప : కడప బంద్ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్ట్‌లతో పాటు గృహ నిర్బంధం కొనసాగుతోంది. నారాయణ కళాశాల విద్యార్థినుల ఆత్మహత్యల నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ బుధవారం కడప నగరం బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేయర్ సురేష్ బాబు, అంజద్ బాషాను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అలాగే పలువురు పార్టీ నాయకులను అరెస్ట్ చేసి, నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు కడప వాసులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ పిలుపునిచ్చిన బంద్‌కు విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. కాగా బంద్‌ను విఫలం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. -
విఐపి రిపోర్టర్ - కడప మేయర్ సురేష్‌బాబు
-
వైఎస్సార్సీపీకే మేయర్, జెడ్పీ చైర్మన్ పదవులు
జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు సిద్దవటం: వైఎస్సార్సీపీ అభ్యర్థులకే కడప మేయర్, జెడ్పీ చైర్మన్ పదవులు లభిస్తాయని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు అన్నారు. మండలంలోని మూలపల్లె గ్రామంలో గురువారం మాజీ సర్పంచ్ ఉపాసి వెంకటసుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి చెందిన జెడ్పీటీసీలు మెజార్టీ స్థానాలలో గెలుపొందారన్నారు. 41 మంది జెడ్పీటీసీలు విజయం సాధించగా వారిలో 33 మంది క్యాంపులో ఉన్నారన్నారు. అలాగే కడప మేయర్ పదవి కూడా వైఎస్సార్సీపీకే దక్కుతుందన్నారు. డబ్బు, అధికార బలంతో టీడీపీ వారు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వైఎస్సార్సీపీకే ఈ పదవులు దక్కటం ఖాయమన్నారు.