మార్కాపురంలో నాగుర్ అనే వ్యక్తి హత్య | Man Murdered at Markapuram in Prakasham district | Sakshi
Sakshi News home page

మార్కాపురంలో నాగుర్ అనే వ్యక్తి హత్య

Mar 9 2014 8:34 AM | Updated on Aug 29 2018 8:36 PM

ప్రకాశం జిల్లా మార్కాపురంలో నాగుర్ అనే వ్యక్తి హత్యకు గురైయ్యాడు.

ప్రకాశం జిల్లా మార్కాపురంలో నాగుర్ అనే వ్యక్తి హత్యకు గురైయ్యాడు. శనివారం అర్థరాత్రి ఒంటరిగా ఉన్న నాగుర్పై కొందరు దుండగులు దాడి చేసి, అతడి కళ్లలో కారం చల్లి కత్తులలో పొడిచారు. దాంతో నాగుర్ అక్కడికక్కడే మరణించాడు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

 

పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని నాగుర్ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. నాగుర్ మృతిపై అతడి కుటుంబసభ్యుల సమాచారం అందించారు. అయితే నాగుర్ మృతిపై హత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement