తుంగభద్ర నదిలో పడి వ్యక్తి మృతి | man missing in tungabhadra river | Sakshi
Sakshi News home page

తుంగభద్ర నదిలో పడి వ్యక్తి మృతి

Aug 15 2015 1:02 PM | Updated on Sep 3 2017 7:30 AM

మద్యం మత్తులో నది దాటుతూ ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

మంత్రాలయం: మద్యం మత్తులో నది దాటుతూ ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. శనివారం కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రాలయం కు చెందిన గురురాజు(40) శనివారం ఉదయం సరిహద్దు కర్ణాటకలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసి తిరుగు ప్రయాణంలో తుంగభద్ర నది దాటుతూ ప్రమాదవశాత్తూ నీటిలో పడి మునిగిపోయాడు. తోటి ప్రయాణికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. గురురాజు మద్యం మత్తులో ఉన్నాడని వారు తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement