ఉరుమురిమి మంగళం మీద పడినట్లుంది ఈ ప్రబుద్ధుడి నిర్వాకం. భార్యతో గొడవ పడిన ఈ యువకుడు ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో ఆవేశం తట్టుకోలేక నాయనమ్మ ఇంటికి నిప్పు పెట్టా డు.
ఉరుమురిమి మంగళం మీద పడినట్లుంది ఈ ప్రబుద్ధుడి నిర్వాకం. భార్యతో గొడవ పడిన ఈ యువకుడు ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో ఆవేశం తట్టుకోలేక నాయనమ్మ ఇంటికి నిప్పు పెట్టా డు. భోగాపురం మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన బేపల గోవింద కొద్ది రోజుల క్రిందట భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె అతనిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. అతనికి నాయనమ్మ సంబంధం కుదిర్చి దగ్గరుండి పెళ్లి చేసింది. దీంతో తన భార్యను తీసుకురావాలని నాయనమ్మతో నిత్యం గొడవపడేవాడు.
ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం నాయనమ్మతో మరోసారి తీవ్రస్థాయిలో గొడవపడ్డాడు. కొద్దిసేపటికి ఆవేశం ఆపుకోలేక నాయన మ్మ ఉంటున్న తాటాకు ఇంటికి నిప్పు పెట్టేశాడు. వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ పిట్ట అప్పారావు గ్రామానికి చేరుకుని ప్రమాదంలో రూ.20 వేలు ఆస్తినష్టం సంభవించినట్లు అంచనావేశారు. ఆ ప్రబుద్ధుడిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.


