కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి | Man Died Accidentally In Krishnashtami Celebrations In West Godavari | Sakshi
Sakshi News home page

కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి

Aug 25 2019 8:05 AM | Updated on Sep 10 2019 11:14 AM

Man Died Accidentally In Krishnashtami Celebrations In West Godavari - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఐ.పోలవరం: కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకోవడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలంలో జరిగింది. మండలంలోని కొమరగిరి గ్రామంలో శుక్రవారం రాత్రి కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా గ్రామస్తులు ఉట్టి కొట్టేందుకు ఏర్పాటు చేశారు. ఉట్టి కొట్టేందుకు సిమెంట్‌ స్తంభాన్ని గ్రామానికి చెందిన నడింపల్లి సత్యనారాయణ రాజు (55) పాతాడు. ఆనందోత్సాహాల మధ్య ఉట్టికొట్టే సమయంలో ప్రమాదవశాత్తు తాను పాతిన సిమెంట్‌ స్తంభం అతడిపై పడింది. దీంతో అతడి తలకు బలమైన గాయమైంది. స్థానికులు అతడిని ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందాడు. దీనిపై ఎస్సై సత్యారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement