మరో బలిదానం | Man commits suicide at nizamabad district | Sakshi
Sakshi News home page

మరో బలిదానం

Jan 16 2014 6:11 AM | Updated on Oct 9 2018 5:43 PM

తెలంగాణ కోసం నిరంతరం పోరాడిన మనుమడు బలవన్మరణానికి పాల్పడితే, మనవడి మరణ వార్త విన్న తాత గుండెపోటుతో మరణించడం గాంధారి మండలంలో విషాదం నింపింది.

గాంధారి, న్యూస్‌లైన్: తెలంగాణ కోసం నిరంతరం పోరాడిన మనుమడు బలవన్మరణానికి పాల్పడితే, మనవడి మరణ వార్త విన్న తాత గుండెపోటుతో మరణించడం గాంధా రి మండలంలో విషాదం నింపింది. మండలంలోని సర్వాపూర్ గ్రామానికి చెందిన గొడుగు సంజీవ్ టీఆర్‌ఎస్‌లో క్రియాశీల కార్యకర్త. నిత్యం తెలంగాణ కోసం తపించేవాడు. ఏ ఆందోళనలోనైనా ముంందుండేవాడు. కట్టుబొట్టు అన్నింటా తెలంగాణ కనిపించేలా వ్యవహరించేవాడు. సంక్రాంతి పండుగ రోజైన మంగళవారం తన నివాసముండే గుడిసె ముందు ముగ్గుతో సంక్రాంతి శుభాకాంక్షలు, జై తెలంగాణ, టీఆర్‌ఎస్ అని రాసి తన ఆకాంక్షను చాటుకున్నాడు. గ్రామంలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్, ఆచార్య జయశంకర్ ఫోటోలు, తన ఫోటోలతో రూపొందించి న ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశాడు.
 
 గుడిసె తలుపునకు, గుంజలకు గులాబీ రంగు వేయించాడు. తన ఎడమచేతిపై గులాబీ రంగుతో టీఆర్‌ఎస్ అని రాసుకున్నా డు. నరనరాన తెలంగాణవాదాన్ని, టీఆర్‌ఎస్ పార్టీని ఇముడ్చుకున్న సంజీవ్ సీమాంధ్ర ప్రాంతంలో తెలంగాణ ముసాయిదా బిల్లులను దహనం చేయడంతో తెలంగాణను అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయని మనస్తాపానికి గురయ్యాడు. తన భార్య అరుణను పండుగ కోసం పుట్టింటికి పంపించాడు. మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు స్నేహితులతో కలిసి తెలంగాణ గురించి చర్చించాడు. రాత్రి ఎవరిదారిన వారు వెళ్లారు. కాని సంజీవ్ మాత్రం గ్రామ నడి బొడ్డున ఉన్న నీళ్ల ట్యాంకు పైకి ఎక్కి తాడుతో ఉరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం గ్రామస్థులు సం జీవ్ మృతదేహాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎప్పుడూ తెలంగాణ కోసమే మాట్లాడే సంజీవ్ చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
 
 మనవడి మరణ వార్తతో తట్టుకోలేక
 సంజీవ్ చనిపోయిన విషయాన్ని నర్సాపూర్ గ్రామం లో ఉండే ఆయన తాత కోటయ్యకు బంధువులు తెలి పారు. మనుమడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తో ఆయన కన్నీరు మున్నీరుగా విలపించి అక్కడికక్క డే కుప్ప కూలిపోయారు. తెలంగాణ కోసం మనవడు చనిపోతే, మనవడి కోసం తాత తనువు చాలించడం అక్కడికి వచ్చినవారందరినీ కలిచివేసింది. తెలంగాణవాదులు శోకసంద్రంలో మునిగిపోయారు. తెలంగాణ కోసం మరణాలు ఆగాలని, తెలంగాణ ఆకాంక్ష నెరవేరబోతున్న తరుణంలో ఎవరూ ఆందోళన చెందవద్దని ఉద్యమకారులు కోరుతున్నారు.
 
 రోడ్డున పడిన కుటుంబం
 సంజీవ్ ఆత్మహత్యతో ఆయన కుటుంబం రోడ్డున పడింది. పెళ్లయిన ఎనిమిది నెలలకే భర్త మరణించడంతో భార్య అరుణ రోదనలు అందరి నీ కలిచివేశాయి. వారి కుటుంబాన్ని బాన్సువాడ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏను గు రవీందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు బాణాల లక్ష్మారెడ్డి, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు తానాజీ రావు, నాయకులు సింగసాని శ్రీనివాస్, సత్యం, బాల్‌రాజ్, మనోహర్‌రావు తదితరులు పరామర్శించారు. అంత్యక్రియలకు హాజరయ్యారు. బాధి త కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement