అప్పుల బాధతో ఓ కూలీ ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా గోరంట్ల మండలం కరావులపల్లి తాండలో సోమవారం చోటుచేసుకుంది.
గోరంట్ల (అనంతపురం) : అప్పుల బాధతో ఓ కూలీ ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా గోరంట్ల మండలం కరావులపల్లి తాండలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వ్యవసాయ కూలీ పనులతో జీవనం సాగిస్తున్న గుర్జునాయక్(45) కుటుంబ అవసరాల కోసం అప్పలు చేశాడు. అయితే రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవడంతో సోమవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.