యువకుడి దారుణ హత్య | man brutally murdered by unknown persons | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

May 29 2015 10:42 AM | Updated on Sep 3 2017 2:54 AM

ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి పీలేరు నదిలో పూడ్చారు.

నందలూరు (వైఎస్సార్ జిల్లా): ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి పీలేరు నదిలో పూడ్చారు. ఈ విషయం శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాలు..  వైఎస్సార్ జిల్లా నందలూరు మండలంలో ఈ దారుణం జరిగింది. మండలంలోని ఆడాపూర్‌కు చెందిన బాలాజీ (26) మూడు రోజులుగా కనిపించడం లేదు. బాలాజీ ఆచూకీ తెలుసుకోవాలని అతడి కుటుంబ సభ్యులు..   పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని పీలేరు నదిలో బాలాజీ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. 'రెండ్రోజుల క్రితమే హత్య చేసి నదిలో పూడ్చారు. అయితే దుండగులు మృతదేహాన్ని సరిగా ఖననం చేయకపోవడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టాం' అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement