విజయనగరంలో భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు | Maha Shivaratri Celebrations In Vizianagaram | Sakshi
Sakshi News home page

విజయనగరంలో భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

Mar 4 2019 9:59 AM | Updated on Mar 4 2019 9:59 AM

Maha Shivaratri Celebrations In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం: మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్ధాలు పుణ్యక్షేత్రంలో నేటి నుంచి రెండు రోజుల పాటు శివరాత్రి మహాజాతర ఉండటంతో ఈరోజు తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యక్షేత్రానికి ఇరుత జిల్లాల నుంచి వేలాదిగా తరలిస్తున్న భక్తులు.

ఎస్‌. కోట: మహాశివరాత్రి సందర్భంగా ఎస్. కోట మండలం పుణ్యగిరి ఉమాకోటిలింగేశ్వరస్వామి దేవస్థానంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాదిగా తరలి వస్తున్న భక్తులు. జిల్లా కేంద్రంలో శివాలయం వీధిలో భక్తులుతో నిండిన శివాలయాలు. ఎస్ కోట నుంచి పుణ్యగిరి కొండవరకు ఇరవై నాలుగు గంటలు పాటు నిరంతరాయంగా పది బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా నాలుగు వందల మంది  పోలీసులుతో బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement