బోల్తా కొట్టి దగ్ధమైన లారీ | lorry accident, driver killed at spot after firing | Sakshi
Sakshi News home page

బోల్తా కొట్టి దగ్ధమైన లారీ

Feb 17 2015 6:42 PM | Updated on Sep 29 2018 5:26 PM

గుంటూరు జిల్లాలోని నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

గుంటూరు(నకిరేకల్లు):  హైదరాబాద్‌కు ఫ్లై వుడ్ లోడుతో వెళుతున్న లారీ బోల్తా కొట్టింది. తర్వాత  ఇంజిన్‌లో మంటలు రేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలం చల్లగుళ్ల వద్ద చోటు చేసుకుంది. అయితే లారీ పూర్తిగా కాలిపోవడంతో డ్రై వర్, క్లీనర్ కూడా సజీవ దహనమైనట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా సంఘటనా ప్రాంతంలో లభ్యమైన పత్రాలు ప్రకారం హైదరాబాద్ సరూర్‌నగర్‌కు చెందిన లారీగా భావిస్తున్నారు. లారీ నంబరు ఏపీ 24టీ 7979.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement