స్వర్ణరథంపై ఊరేగిన శ్రీనివాసుడు | Lord Venkateswara rides on golden chariot | Sakshi
Sakshi News home page

స్వర్ణరథంపై ఊరేగిన శ్రీనివాసుడు

Jan 11 2014 12:44 PM | Updated on Sep 2 2017 2:31 AM

స్వర్ణరథంపై ఊరేగిన శ్రీనివాసుడు

స్వర్ణరథంపై ఊరేగిన శ్రీనివాసుడు

కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడు శనివారం స్వర్ణరథంపై ఊరేగారు.

తిరుమల : కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడు శనివారం స్వర్ణరథంపై ఊరేగారు.  వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవేకంటేశ్వరస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్థరథంపై ఊరేగారు. తిరువీధుల్లో భక్తులకు కటాక్షిస్తూ స్వామివారు విహరించారు. వేలాది మంది భక్తులు స్వామివారి రథాన్ని లాగుతూ శ్రీవారి సేవలో తరించారు.  

వైకుంఠ ఏకాదశి పర్వదినం శనివారం రావడంతో భక్తులు విశేషంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. కర్పూర హారతులతో స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏటా టీటీడీ ఈ ఉత్సవాన్ని ముక్కోటి ఏకాదశి రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రథోత్సవంలో టీటీడీ అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు , ఈవో ఎంజీ గోపాల్‌, జేఈవో శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement