రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చంద్రబాబు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని, అందుకే ఆయనకు ప్రజాదరణ తగ్గిందని లోక్‌సత్తా పార్టీ అభిప్రాయపడింది.
సాక్షి, విజయవాడ: రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చంద్రబాబు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని, అందుకే ఆయనకు ప్రజాదరణ తగ్గిందని లోక్‌సత్తా పార్టీ అభిప్రాయపడింది. విజయవాడ రోటరీ చిల్డ్రన్స్ ఆడిటోరియంలో మంగళవారం లోక్‌సత్తాపార్టీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు వల్ల ప్రజలకు ఎటువంటి లాభం లేదని విమర్శించారు.
ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు పెరిగిపోయాయని, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా గురించి కనీసం మాట్లాడలేని స్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు.