మీ అంగీకారం తెలపండి | Let your acceptance | Sakshi
Sakshi News home page

మీ అంగీకారం తెలపండి

Dec 28 2016 1:50 AM | Updated on Mar 28 2019 5:39 PM

గ్రూప్‌ 2–1999 పోస్టులకు గాను మెరిట్‌ జాబితా ప్రకారం ఎంపికైన అభ్యర్థులంతా ఆయా పోస్టుల్లో చేరడానికి సుముఖమో కాదో లేఖలు అందించాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మంగళవారం ప్రకటన జారీచేసింది.

లేఖలు కోరిన ఏపీపీఎస్సీ  

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌ 2–1999 పోస్టులకు గాను మెరిట్‌ జాబితా ప్రకారం ఎంపికైన అభ్యర్థులంతా ఆయా పోస్టుల్లో చేరడానికి సుముఖమో కాదో లేఖలు అందించాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మంగళవారం  ప్రకటన జారీచేసింది. సుప్రీం ఆదేశాల మేరకు ఈనెల 23న కొత్తగా మెరిట్‌ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఆ ప్రకారం ఇప్పటికే సర్వీసులో ఉన్న వారి స్థానాలు మార్పు జరిగి ఏదో ఒక పోస్టులోకి వెళ్తున్నందున వారినుంచి అంగీకారం తీసుకోలేదు. గతంలో ఎలాంటి పోస్టు అలాట్‌ కాని వారిని మాత్రమే వారంలోగా అంగీకార లేఖలు కోరింది. అందరినుంచి లేఖలు అడగాలని  విన్నపాలు అందుతుండటంతో తాజా నిర్ణయం తీసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement