చిరుత సంచారంతో ప్రజల బెంబేలు 

Leopard wandering In Chowdepalli Village - Sakshi

సాక్షి, చౌడేపల్లె(చిత్తూరు): మండలంలోని కందూరు బీట్, తవళం బీట్‌ పరిధిలో గోవిందురాజుల చెరువు సమీపంలో గల అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నాగిరెడ్డిపల్లె, ఎల్లంపల్లె, బత్తలాపురం, తెల్లనీళ్లపల్లె మడుకూరు తదితర గ్రామాలకు చెందిన రైతుల పంట పొలాలకు సమీపంలోనే అటవీ ప్రాంతం కలదు. పదిరోజుల క్రితం చిరుతపులి దాడిలో బత్తలాపురానికి చెందిన సుబ్రమణ్యం, గంగాధర్, ఎల్లంపల్లెకు చెందిన నరసింహులు ఆరు మేకలు మృతిచెందాయి. దీంతో అటవీ ప్రాంతంలోకి మేతకు మేకలు, పశువులు, గొర్రెలను తోలుకెళ్లడం లేదు. చిరుత పులితోపాటు వాటి పిల్లలు కూడా ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నెమిలిగుట్ట, పారాలకుప్ప, గువ్వరాయి, గోవిందరాజుల చెరువు, మడుకూరు మార్గంలో పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ విషయం తెలిసినా అటవీశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని వావపోతున్నారు. దీనిపై ఎఫ్‌బీవో రామకృష్ణ మాట్లాడుతూ పులి సంచారం విషయమై ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. అడవి వైపు వెళ్ల వద్దని ప్రజలను తెలియజేసినట్టు పేర్కొన్నారు.  


                అటవీ ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న ఎస్టీలు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top