'నేను సైతం కృష్ణమ్మ సేవలో' .. | Krishna Nadi Shuddhi Program in Gudivada | Sakshi
Sakshi News home page

'నేను సైతం కృష్ణమ్మ సేవలో' ..

Jun 1 2019 10:40 AM | Updated on Jun 1 2019 10:42 AM

Krishna Nadi Shuddhi Program in Gudivada - Sakshi

గుడివాడలో ఉన్న కృష్ణానది కాలువలను, డ్రెయినేజీలను కూడా శుభ్రం చేస్తున్నామని అధికారులు తెలిపారు.

సాక్షి, విజయవాడ : జిల్లా యంత్రాంగం కృష్ణమ్మ శుద్ధికి శ్రీకారం చుట్టింది. 'నేను సైతం కృష్ణమ్మ సేవలో' పేరుతో జిల్లా యంత్రాంగం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ‘స్వచ్ఛ గుడివాడ’ కార్యక్రమం శనివారం ఉదయం ప్రారంభమైంది. గుడివాడలో ఉన్న కృష్ణానది కాలువలను, డ్రెయినేజీలను కూడా శుభ్రం చేస్తున్నామని అధికారులు తెలిపారు. పట్టణంలోని నెహ్రూ చౌక్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని, జిల్లా కలెక్టర్ ఎండీ ఇంతియాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, మున్సిపల్ కమిషనర్ శ్యామ్యుల్, ఆర్డీఓ సత్యవతి, ఇతర అధికారులు పలు సంఘాల ప్రతి నిధులు పాల్గొన్నారు.

కృష్ణమ్మ శుద్దికి పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయని, జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ కవర్లు నిషేధానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఆ ప్రక్రియను గుడివాడ నుంచే ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు చేస్తామని అన్నారు. గుడివాడను భవిష్యత్తులో సుందర... స్వచ్చ గుడివాడ గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నాని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement