' అభివృద్ధికి ఆమడ దూరంలో బెజవాడ' | Koneru Prasad comments on vijayawada city | Sakshi
Sakshi News home page

' అభివృద్ధికి ఆమడ దూరంలో బెజవాడ'

Mar 15 2014 1:50 PM | Updated on Jul 25 2018 4:09 PM

రాష్ట్ర రాజకీయాలలో విజయవాడ నగరం కీలకపాత్ర పోషిస్తుందని, అయితే ఆ నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి కోనేరు ప్రసాద్ శనివారం విజయవాడలో తెలిపారు.

రాష్ట్ర రాజకీయాలలో విజయవాడ నగరం కీలకపాత్ర పోషిస్తుందని, అయితే ఆ నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి కోనేరు ప్రసాద్ శనివారం  విజయవాడలో తెలిపారు.అందుకే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను విజయవాడ పంపారని చెప్పారు.


విజయవాడ నగరాన్ని హెల్త్ టూరిజం సెంటర్గా అభివృద్ధి చేస్తానని ఆయన విజయవాడ నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో ముఫ్పై ఏళ్లపాటు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేలా పని చేస్తానని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. నగరంలోని అన్ని రంగాలలో ప్రొఫిషనల్స్ను గ్రూప్గా తయారు చేసి విజయవాడను అభివృద్ధి చేస్తానన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement