'ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని చూస్తున్నారు' | Kodali nani takes on tdp government | Sakshi
Sakshi News home page

'ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని చూస్తున్నారు'

Jan 7 2015 1:21 PM | Updated on May 25 2018 9:17 PM

'ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని చూస్తున్నారు' - Sakshi

'ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని చూస్తున్నారు'

ఆంధ్రప్రదేశ్లో దుష్టపాలన సాగతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు.

గుడివాడ: ఆంధ్రప్రదేశ్లో దుష్టపాలన సాగతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. బుధవారం గుడివాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట కొడాలి నాని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వృద్ధులు, రైతులు, వితంతువులు, నిరుద్యోగుల కన్నీటితో బాబు ప్రభుత్వం కూలడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. లోటు బడ్జెట్ అని తెలిసి కూడా అమలుకాని హామీలు ఇచ్చి ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు.

ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పయ్యావుల కేశవ్ నామినేట్ పదవి కోసమే బాబును స్తుతిస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ, బయట కూడా ప్రతిపక్ష పాత్రలు పోషిస్తున్నారని కొడాలి నాని టీడీపీ నేతలపై మండిపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement