కిరణ్ ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే! | Kiran kumar reddy till now in congress after resign to CM | Sakshi
Sakshi News home page

కిరణ్ ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే!

Mar 10 2014 1:45 AM | Updated on Jul 29 2019 5:31 PM

కిరణ్ ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే! - Sakshi

కిరణ్ ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే!

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో విభేదించి ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి... ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారు!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో విభేదించి ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి... ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారు! ఆశ్చర్యపోతున్నారా? అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) అధికారిక వెబ్‌సైట్ చూస్తే ఇదే సందేహం వస్తుంది. ఎందుకంటే, అందులో కిరణ్‌కుమార్ రెడ్డి ఫొటోలు ఇప్పటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి.
 
  రాష్ట్రాల వారీగా పార్టీ ముఖ్యనేతలకు సంబంధించిన వివరాలలో.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఫోటోతో పాటు కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోటో కూడా అలానే ఉంచారు. అంతేకాదు, ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ స్క్రీనింగ్ కమిటీలోనూ కిరణ్‌కుమార్‌రెడ్డి సభ్యుడుగా ఉన్నట్లు వెబ్‌సైట్‌లో సమాచారం తెలియజేస్తోంది. అంటే, కిరణ్‌కుమార్‌రెడ్డిని ఇప్పటికీ తమ పార్టీ నేతగానే కాంగ్రెస్ భావిస్తున్నట్లుంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement