కిడ్నాపైన బాలుడి మృతి | kidnap boy dies in guntur distrcit | Sakshi
Sakshi News home page

కిడ్నాపైన బాలుడి మృతి

May 11 2015 6:52 AM | Updated on Aug 24 2018 2:36 PM

రెండు రోజుల క్రితం కిడ్నాపైన బాలాజీ (8) మృతి చెందాడు.

మాచవరం(గుంటూరు జిల్లా): రెండు రోజుల క్రితం కిడ్నాపైన బాలాజీ (8) మృతి చెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచవరం మండలం మల్లవోలు గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. వివరాలు.. మాచవరం మండలంలోని మల్లవోలు గ్రామానికి చెందిన తిరుమలరావు ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అదే మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన బాబుకూని కృష్ణ మనవడు బాలాజీ (8)ని తిరుమలరావు శనివారం కిడ్నాప్ చేశాడు.

అనంతరం బాలుడి తాతకు ఫొన్ చేసి రూ. 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాలుడి తాత పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు తిరుమలరావును ఆదివారం అదుపులోకి తీసుకొని విచారించగా జరిగిన విషయం పూస గుచ్చాడు. బాలుడిని తన ఇంటిలోనే నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు, కాళ్లు కట్టిపడేశానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే బాలుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement