ఆ తల్లిదండ్రులకు ఎమ్మెల్యే కుమార్తె చేయూత

Kakani Govardhan Reddy Daughter Helps Parents Who Have Lost Their Children - Sakshi

సాక్షి, మనుబోలు: కన్న బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులకు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె శ్రీమతి పూజిత చేయూతనిచ్చారు. మనుబోలు మండలం కొమ్మలపూడిలో ఈతకు వెళ్లి చెరువులో మునిగి చనిపోయిన చిన్నారులు హేమంత్, సురేష్‌ల తల్లిదండ్రులు బైనా సుబ్బారెడ్డి–సునీత దంపతులను సోమవారం పూజిత పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి రూ.లక్ష నగదు, బట్టలు, పిండి వంటలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బిడ్డలను కోల్పోయిన తల్లితండ్రుల దుఖాన్ని ఏమి ఇచ్చినా తీర్చలేమని, తాము చేసే ఆర్థిక సాయం కేవలం వారికి ధైర్యం చెప్పేందుకేనన్నారు. భగవంతుడు వారికి ఆ దుఖాన్ని తట్టుకునే మనో ధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. ఆమె వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు మన్నెమాల శ్రీనివాసులురెడ్డి, చెందులూరు శ్రీనివాసులు, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డిŠ, గుమ్మా శ్రీనివాసులు, వేణు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top