
కాళోజీ తపాలా బిళ్ల ఆవిష్కరణ
ప్రజాకవి కాళోజీ రచించిన ‘నా గొడవ’ కవితా సంపుటి 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రూపొందించిన తపాలా బిళ్లను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఆదివారం ఆవిష్కరించారు.
వరంగల్, న్యూస్‌లైన్: ప్రజాకవి కాళోజీ రచించిన ‘నా గొడవ’ కవితా సంపుటి 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రూపొందించిన తపాలా బిళ్లను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఆదివారం ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని కాళోజీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు కాళోజీ నారాయణరావు స్ఫూర్తిగా నిలుస్తారన్నారు.