
సివిల్ సర్జన్ల నియామకాలు ఆపండి: నారాయణ
రాష్ట్రంలో అసిస్టెంట్ సివిల్ సర్జన్ల నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నందున తక్షణమే వాటిని నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలో అసిస్టెంట్ సివిల్ సర్జన్ల నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నందున తక్షణమే వాటిని నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. అవకతవకలపై వైద్యబృందం ఇచ్చిన వినతి పత్రం ఆధారంగా నారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆదివారం లేఖ రాశారు.
1142 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారుతున్నట్టు ఆరోపించారు. మెడికల్ డెరైక్టర్ నిబంధనలను పక్కనబెట్టి పెద్దఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారని, ఆ అధికారి జాబితాను పక్కనబెట్టి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ప్రపంచ యువజనోత్సవాలకు ఎస్‌ఎఫ్‌ఐ నేతలు
లాటిన్ అమెరికాలోని ఈక్వెడర్ దేశంలో జరిగే 18వ ప్రపంచ యువజన ఉత్సవాలకు డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.చంద్రమోహన్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి పగడాల లక్ష్మయ్య హజరవుతున్నారు. సుమారు 150 దేశాల ప్రతినిధులు ఈ సభలకు హాజరవుతున్నారు. ప్రతి మూడేళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాలకు రాష్ట్రం నుంచి హాజరవుతున్న యువజన ప్రతినిధుల్లో వీరిద్దరూ ఉన్నారు.