మెడికల్ పీజీ ఎంట్రన్స్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. గవర్నర్ నరసింహన్ను బుధవారం సాయంత్రం కలసి ఈ మేరకు విన్నవించారు.
హైదరాబాద్: మెడికల్ పీజీ ఎంట్రన్స్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. గవర్నర్ నరసింహన్ను బుధవారం సాయంత్రం కలసి ఈ మేరకు విన్నవించారు.
ఎంట్రన్ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెడికల్ పీజీ సీట్ల వివాదాన్ని గవర్నర్ దృష్టికి జూనియర్ డాక్టర్లు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన నరసింహన్ విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ప్రొఫెసర్ ఎల్వీ వేణుగోపాల్‌రెడ్డిని నియమించారు. అంతకుముందు లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ గవర్నర్ ను కలసి మెడికల్ పీజీ సీట్ల వివాదంపై విచారణ జరిపించాలని కోరారు.