పొత్తుపై కేజ్రీవాల్తో చర్చలు | Jayaprakash Narayana met Kejriwal | Sakshi
Sakshi News home page

పొత్తుపై కేజ్రీవాల్తో చర్చలు

Jan 11 2014 4:08 PM | Updated on Sep 2 2017 2:31 AM

పొత్తుపై కేజ్రీవాల్తో చర్చలు

పొత్తుపై కేజ్రీవాల్తో చర్చలు

లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్‌నారాయణ ఈరోజు ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కలిశారు.

న్యూఢిల్లీ: లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్‌ నారాయణ(జెపి) ఈరోజు ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కలిశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో పొత్తు విషయమై ఆయన కేజ్రీవాల్తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనలో  లోక్సత్తా పార్టీ ఉంది.

అనంతరం జెపి మాట్లాడుతూ  కేజ్రీవాల్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పార్టీ విలీనమా? పొత్తా? అనేది మున్ముందు మీకే తెలుస్తుందన్నారు.  దేశ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధం అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. తెలంగాణకు తమ పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. అయితే విభజన అనేది ఏకపక్షంగా జరుగకూడదని తాము చెబుతున్నట్లు తెలిపారు.

అతి తక్కువ వ్యవధిలోనే ఆప్ ఢిల్లీలో అధికారం చేపట్టడంతో అందరి దృష్టి దానిపై పడింది. సామాన్యుల పార్టీగా ముద్రపడటంతో ప్రజలు కూడా ఆప్ వైపు చూస్తున్నారు. కేజ్రీవాల్ అధికార పీఠాన్ని అధిష్టించి పేద ప్రజలకు ఆశలు కల్పించారు. అయితే ఆప్ పైపు ఆశగా చూసే కొందరు కాంగ్రెస్ మద్దతు స్వీకరించడాన్ని  జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement