
ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలను జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అభినందించారు.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలను జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత మీడియా పాయింట్ వద్ద పుష్ప గుచ్ఛాలతో కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు. మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కూ పుష్ప గుచ్ఛం అందించారు. (మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణం)
ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, అన్ని వర్గాలకు న్యాయం చేసిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. ‘ఇద్దరు బీసీ నేతలను రాజ్యసభకు పంపారు. నాకు డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించార’ని కృష్ణదాస్ అన్నారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన చెప్పారు. (‘రాజు’ మంత్రి అయ్యారు! )