జగన్ ప్రభంజనంలో బాబు కొట్టుకుపోతారు: లక్ష్మీపార్వతి | Jagan is Only One Leader for Fighting Samaikyandhra : Lakshmi Parvati | Sakshi
Sakshi News home page

జగన్ ప్రభంజనంలో బాబు కొట్టుకుపోతారు: లక్ష్మీపార్వతి

Oct 26 2013 4:51 PM | Updated on Jul 25 2018 4:09 PM

జగన్ ప్రభంజనంలో బాబు కొట్టుకుపోతారు: లక్ష్మీపార్వతి - Sakshi

జగన్ ప్రభంజనంలో బాబు కొట్టుకుపోతారు: లక్ష్మీపార్వతి

వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ప్రభంజనంలో రెండు కళ్లు, మూడు కాళ్ల సిద్ధాంతంతో ఉన్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొట్టుకోపోతారని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి హెచ్చరించారు.

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి  ప్రభంజనంలో రెండు కళ్లు, మూడు కాళ్ల సిద్ధాంతంతో ఉన్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొట్టుకోపోతారని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి హెచ్చరించారు. ఎల్బి స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సమైక్య పోరు చేస్తోన్న జగన్‌కు తెలుగు ప్రజలంతా అండగా ఉన్నారని తెలిపారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి అభివృద్ధి పరిచిన సమర్ధనేతలు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అని చెప్పారు. వారి ఆశయాలను అమలు చేయగల ఏకైక నేత  జగన్ అని  లక్ష్మిపార్వతి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement