
చనిపోలేదు.. చంపేశారు..
తమ బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదు.. కట్నం కోసం వేధించి.. నిప్పంటించి చంపేశారంటూ సుమతి మృతదేహంతో ఆమె భర్త ఇంటి ముందు కుటుంబీకులు ఆందోళన చేశారు.
- భర్త ఇంటి ఎదుట సుమతి మృతదేహాంతో ఆందోళన
బి.కొత్తకోట : తమ బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదు.. కట్నం కోసం వేధించి.. నిప్పంటించి చంపేశారంటూ సుమతి మృతదేహంతో ఆమె భర్త ఇంటి ముందు కుటుంబీకులు ఆందోళన చేశారు. శనివారం స్థానిక శెట్టిపల్లె రోడ్డులోని చౌడప్ప ఇంటి వద్ద సుమారు 3 గం టల పాటు చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా.. బి.కొత్తకోటకు చెంది న తలారి చౌడప్ప(35), సుమతి(27) స్థానిక శెట్టిపల్లె రోడ్డులో కాపురముం టున్నారు. గురువారం రాత్రి సుమతి శరీరం తీవ్రంగా కాలిపోయిన స్థితిలో చికిత్స కోసం మదనపల్లెకు తరలిం చగా శుక్రవారం ఉదయం ఆమె మరణించింది.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శనివారం బి.కొత్తకోటలోని భర్త చౌడప్ప ఇంటికి తీసుకొస్తుండగా.. అతని తండ్రి రెడ్డెప్ప, సోదరి మంజులపై మృతురాలి బంధువులు దాడికి యత్నించడంతో వారు పరారయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఏనాడూ తమ బిడ్డను సంతోషంగా చూసుకోలేదంటూ వారు రో దించారు. కట్నం కోసం వేధించి శవంగా మార్చేశారంటూ ఆగ్రహిం చారు. తమ కు క్షోభ మిగిలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఎస్‌ఐ ప్రసాద్, సిబ్బంది చేరుకుని బాధితులను శాంతింపజేసేందుకు యత్నించారు.
న్యాయం జరిగే వరకు శవాన్ని ఖననం చేసేది లేదంటూ వారు పట్టుబట్టారు. మృతదేహాన్ని చౌడప్ప ఇంటి గుమ్మం ఎదుటే ఖననం చేసేందుకు సుమతి అక్కలైన ఉషా, కవిత గునపాలతో సమాధి తవ్వేందుకు యత్నించారు. పోలీసులు వారించారు. అయితే ఆమె భర్త లేకుండా అంత్యక్రియలు జరిపేం దుకు వీలులేదని వారు భీష్మించారు. ఎక్కడున్నా రప్పించాలని కోరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని భావించి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, న్యాయం చేసి తీరుతామని ఏఎస్‌ఐ ప్రసాద్ హామీ ఇచ్చా రు. అయినా బంధువులు శాం తించలేదు. చివరకు ఎస్‌ఐ బాధితులతో మాట్లాడారు. కేసు నమోదు చేశామని, నిందితులను అరెస్ట్ చేస్తామని స్పష్టం చే యడంతో శాంతించి అంత్యక్రియలు నిర్వహించేందుకు సుమతి మృతదేహాన్ని తరలించారు. పరారైన చౌడప్ప సెల్ స్విచ్ఛాప్‌లో ఉందని, గాలించి పట్టుకుంటామని ఏఎస్‌ఐ చెప్పారు. అమ్మమ్మ శ్యామలమ్మ, పిల్లలు నాగార్జున, మహేశ్వరి రోదన వర్ణణాతీతం.