స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇస్రో విజయాలు | isro achievements from domestic technical education | Sakshi
Sakshi News home page

స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇస్రో విజయాలు

Jan 13 2014 2:45 AM | Updated on Sep 2 2017 2:34 AM

పేద, మధ్య తరగతి కుటుం బాల నుంచి వచ్చిన మన దేశంలోని ఇంజనీర్లతో, పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇస్రో విజయాలు సాధిస్తోం దని శ్రీహరికోట షార్ డెరైక్టర్ ఎం.వై.ఎస్.ప్రసాద్ చెప్పారు.

 చేబ్రోలు, న్యూస్‌లైన్ : పేద, మధ్య తరగతి కుటుం బాల నుంచి వచ్చిన మన దేశంలోని ఇంజనీర్లతో, పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇస్రో విజయాలు సాధిస్తోం దని శ్రీహరికోట షార్ డెరైక్టర్ ఎం.వై.ఎస్.ప్రసాద్ చెప్పారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో రెండు రోజులు జరిగిన జాతీయ యువజనోత్సవాలు, విజ్ఞాన్ మహోత్సవ్-2014 శనివారం ఘనంగా ముగిశాయి. వివిధప్రాంతాల నుంచి 20 వేల మంది విద్యార్థులు హాజరైన ఈ ఉత్సవాల ముగింపు సభలో షార్ డెరైక్టర్ మాట్లాడుతూ 50 ఏళ్ల కిందట అమెరికా, రష్యా, ప్రాన్స్‌ల సహకారంతో ఒక చిన్న రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో అద్వితీయ ప్రగతి సాధించిందన్నారు. ప్రస్తుతం ఇస్రో ఫ్రాన్స్‌కు చెందిన రెండు శాటిలైట్లను రూ.120 కోట్లు తీసుకుని ప్రయోగించిందన్నారు. మరొకటి ఈ సంవత్సరం ప్రయోగించనుందన్నారు. ఇస్రో విజయం ఒక రోజుతోనో, ఒక వ్యక్తి కృషితోనో వచ్చింది కాదని, వేలాదిమంది ఇస్రో సిబ్బంది సమష్టి కృషితోనే విజయం సాధించామని చెప్పారు.
 
  ఐడిల్‌బ్రెయిన్.కామ్ ఎడిటర్ జి.వి.రమణ మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాదు.. జీవితంలోనూ రాణించాలని, కెరీర్‌లో దూసుకుపోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ కోర్సు జీవితంలో టర్నింగ్ పాయింట్ అన్నారు. మనకు ఇష్టమున్న రంగంలోనే కెరీర్‌ను ప్రారంభించాలని సూచించారు. సినీ హీరో, విజ్ఞాన్ పూర్వ విద్యార్థి నారా రోహిత్ మాట్లాడుతూ జీవితంలో రాజీ పడవద్దని, అనుకున్న రంగంలో కృషిచేసి విజయాలను సాధించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement