గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, ప్రజల స్థితి గతులపై క్షుణ్ణుంగా అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ట్రైనీ ఐఏఎస్‌లకు సూచించారు
కలెక్టరేట్, న్యూస్‌లైన్:
గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, ప్రజల స్థితి గతులపై క్షుణ్ణుంగా అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ట్రైనీ ఐఏఎస్‌లకు సూచించారు. గ్రామీణ సమస్యలపై ఆధ్యయనం చేసేందుకు జిల్లాకు వచ్చిన 28మంది ట్రైనీ ఐఏఎస్ అదికారులు సోమవారం కలెక్టర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత సమస్యలను గుర్తించినప్పుడే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. దేశభివృద్ధికి గ్రామాలు అతి ముఖ్యమైనవైనందున వాటి పురోభివృద్ధికి కృషిచెయ్యాలన్నారు. దీంతోపాటు, ఆర్థిక, సామాజిక, బౌగోళిక అంశాలపై పట్టు సాధించాలన్నారు. జిల్లాతో మెజార్టీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. సాగునీటి సౌక ర్యం కల్పించేం దు కు జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన నాలుగు ఎత్తిపోతల పథకాలు నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో వలసలు ఎక్కువగా ఉంటాయని, ఈ ప్రభావం విద్య, ఆరోగ్య రంగాలపై కనిపిస్తుందన్నారు.
ఉపాధి హామీ పథకం ద్వారా వలసలను కొంత వరకు నియంత్రించగలిగామని, పూర్తిస్థాయిలో ఆరికట్టేందుకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. మాతా, శిశు మరణాల రేటు ఎక్కువగా ఉందని, చిన్న వయస్సు లో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చెయ్యడం, పౌష్టికాహార లోపం, బాలికల ఆరోగ్య సమస్యలు ఇందుకు కారణమన్నారు.జిల్లాలో బాలిక విద్యను ప్రోత్సహించేందుకు రెసిడెన్షియల్, నాన్ రెసిరెన్షియల్స్‌తోపాటు, రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా వసతి గృహాలను ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. అంతకుముందు ట్రైనీ కలెక్టర్ విజయరామరాజు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లాలో వ్యవసాయం, పశు సంపద, పరిశ్రమలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా, సమాచార, పర్యాటక తది తర అంశాలపై వివరించారు.
7రోజుల పాటు 102అంశాలపై
ఆధ్యయనం.....
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ట్రైనీ ఐఏఎస్‌లు ఎంపిక చేసిన గ్రామాల్లో 7రోజులపాటు 102అంశాలపై అధ్యయనం చెయ్యనున్నారు. వీరు నలుగురు చొప్పున ఏడు బృందాలుగా గ్రామాల్లో స్థితి గతులపై అధ్యయనం చేస్తారు. నాగర్‌కర్నూల్ డివిజ న్ పరిధిలోని అక్కారం, ఉప్పునుంతల, పెద్దకొత్తపల్లి, గద్వాల్ డివిజన్ పరిధిలో గట్టు, రాయవరం, మల్దకల్, సద్దలోనిపల్లి, అలంపూర్, బీమవరం, గద్వాలలో పర్యటించనున్నారు. 88వ ఫౌండేషన్ కోర్సుకు చెందిన వీరు ఐఏఎస్‌కు ఎంపికై డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ లో మూడున్నర నెలలపాటు శిక్షణ పొం దేందుకు రాష్ట్రానికి రాగా, ఆధ్యాయనం నిమిత్తం జిల్లాకు వచ్చారు. ఎంసిహెచ్‌ఆర్‌డికి చెందిన శ్రీనివాస్ వీరికి సమన్వయకర్త గా వ్యవహరించనున్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఏ పీడి చంద్రశేఖర్ రెడ్డి, ఎపిఎంఐపి పిడి విద్యాశంకర్‌తోపాటు, శిక్షణ ఐఏఎస్‌లు తదితరులు పాల్గొన్నారు.


