అక్రమ పునాదుల జోరు | Illegal foundations of the second | Sakshi
Sakshi News home page

అక్రమ పునాదుల జోరు

Jan 19 2014 2:34 AM | Updated on Sep 2 2017 2:45 AM

ప్రభుత్వ స్థలంపై కన్నేశారు.. అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్నారు.. అంతే.. అక్రమ పునాదులు వేస్తూ.. దర్జాగా కబ్జా చేస్తున్నారు.

 ప్రభుత్వ స్థలంపై కన్నేశారు.. అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్నారు.. అంతే.. అక్రమ పునాదులు వేస్తూ.. దర్జాగా కబ్జా చేస్తున్నారు. ప్రొద్దుటూరు ఇందిరమ్మ కాలనీలోని పేజ్-1,2 కింద పేదలకు కేటాయించిన ఖాళీ స్థలాల్లో అక్రమ పునాదుల జోరు మళ్లీ ఊపందుకుంది.     
 
 ప్రొద్టుటూర్ టౌన్, న్యూస్‌లైన్: కొత్తపల్లె పంచాయతీ మైలవరం కాలువకు పక్కనే ఉన్న 350 ఎకరాలను ప్రభుత్వం ఫేజ్-1,2,3 కింద ఇందిరమ్మ పథక లబ్ధిదారులకు కేటాయించింది. ఇందిరమ్మ ఫేజ్-1 కింద లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలో కొందరు అక్రమ పునాదులు వేస్తున్నారు. గతంలోనూ కొంతమంది ఇక్కడ అక్రమ పునాదులు వేసినా .. అప్పట్లో హౌసింగ్, రెవెన్యూ అధికారులు స్పందించి వాటిని తొలగించారు. ఈ తతంగం జరిగి ఏడాది దాటినా తొలగించిన పునాదుల స్థలాల అసలైన లబ్ధిదారులను హౌసింగ్ అధికారులు గుర్తించలేదు. ఇటీవలే ఇందిరమ్మ కాలనీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వెలుస్తున్న ఈ పునాదులు అసలైన లబ్ధిదారులవేనా.. లేక అక్రమదారులవా అన్నది అధికారులు తేల్చాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement