సభ్యులు అడిగితే ‘ఓటింగ్’ తప్పదు | If members demands Voting unavoidable, says Nadendla Manohar | Sakshi
Sakshi News home page

సభ్యులు అడిగితే ‘ఓటింగ్’ తప్పదు

Published Wed, Jan 8 2014 2:26 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

If members demands Voting unavoidable, says Nadendla Manohar

 •  స్పీకర్ నాదెండ్ల స్పష్టీకరణ
 •  సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సభ్యులు క్లాజులకు సవరణలు ప్రతిపాదించి, డివిజన్ అడిగితే ఓటింగ్ నిర్వహించక తప్పదని స్పీకర్ నాదెండ్ల వునోహర్ స్పష్టంచేశారు. సవరణలు ప్రతిపాదించటంతో పాటు డివిజన్ అడిగే హక్కు సభ్యులకు ఉంటుందని, దాన్ని కాదనలేవుని ఆయన పేర్కొన్నారు. వుంగళవారం అసెంబ్లీ వారుుదాపడిన అనంతరం తనను కలిసిన మీడియూ ప్రతినిధులతో స్పీకర్ ఇష్టాగోష్టిగా వూట్లాడారు.
   
  బిల్లుకు సంబంధించి అసెంబ్లీలో ఓటింగ్ ఉంటుందా? ఉండదా? అనేది తాను ఎలా చెప్పగలనని, అది సభ్యుల తీరును అనుసరించి ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. బిల్లుపై సభ అభిప్రాయుం తెలపాలని వూత్రమే రాష్ట్రపతి స్పష్టంగా చెప్పినందున సవరణలకు ఆస్కారమివ్వరాదని తెలంగాణ ప్రాంత నేతలు పట్టుపడుతున్న అంశాన్ని ప్రస్తావించగా.. అన్ని అంశాలనూ క్షుణ్నంగా పరిశీలించాకనే నిష్పక్షపాతంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే చర్చ పద్ధతిని తాను రూపొందించాననని వునోహర్ బదులిచ్చారు.
   
  ఇంతకువుుందు విభజన జరిగిన రాష్ట్రాల్లో పర్యటించావుని, పార్లమెంటరీ నిపుణులతో, న్యాయుకోవిదులతో చర్చించి.. అసెంబ్లీ నిబంధనలను లోతుగా పరిశీలించిన తరువాతనే చర్చకు వీలైన వూర్గాన్ని రూపొందించామని చెప్పారు. సభలో చర్చ సందర్భంగా సవరణలు ప్రతిపాదించవచ్చని సభ్యులదరికీ తెలిపావున్నారు.
   
  అలాగే లిఖితపూర్వక అభిప్రాయూలు కూడా అందించేందుకు అనువుతిస్తానని బీఏసీలో వివరించినట్లు తెలిపారు. అరుుతే బీఏసీలో పేర్కొన్న అంశాలు ఆయూ పార్టీల ప్రతినిధులు తవు సభ్యులందరికీ తెలియుచేస్తే వారికి ఉన్న అనువూనాలు కూడా నివృత్తి అవుతాయుని చెప్పారు. సభ సజావుగా సాగి చర్చ జరుగుతుందని భావిస్తున్నావున్నారు. 

Advertisement
Advertisement
Advertisement