రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) ఆర్డినెన్స్ వెలువడకుండానే, దానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కమిషనర్‌ను నియమించింది.
నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా జానకి.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) ఆర్డినెన్స్ వెలువడకుండానే, దానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కమిషనర్‌ను నియమించింది. 1998 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నెల్లూరు జిల్లా కలెక్టర్ నాగులపల్లి శ్రీకాంత్‌ను ప్రత్యేక కమిషనర్‌గా నియమించింది. గ్రేటర్ విశాఖపట్టణం అదనపు కమిషనర్ ఎం. జానకిని ప్రభుత్వం నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా నియమించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జపాన్ పర్యటనకు వెళ్లిన వారి స్థానంలో ఇన్‌చార్జిలు
ముఖ్యమంత్రితోపాటు జపాన్ పర్యటనకు వెళ్లిన అధికారుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌చార్జిలను నియమించింది. ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్ బాధ్యతలను ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లంకు అప్పగించారు. సతీష్ చంద్ర జపాన్ వెళ్లినందున ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ బాధ్యతలను ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ వీణా ఈస్‌కు అప్పగించారు. ఐ అండ్ ఐ ముఖ్య కార్యదర్శి డి. సాంబశివరావు బాధ్యతలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి. రమేశ్‌కు అప్పగించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్ బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శి శాలిని మిశ్రాకు అప్పగిం చారు. ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్ బాధ్యతలను జెన్‌కో ఎండీ కె.విజయానంద్‌కు అప్పగించారు. ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అనురాధ బాధ్యతలను డీజీపీ చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.