‘వైఎస్సార్ సీపీలో ఉన్నందుకు గర్వపడుతున్నా’ | i feel proud as ysrcp leader, says mla rk roja | Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్ సీపీలో ఉన్నందుకు గర్వపడుతున్నా’

Mar 12 2017 11:38 AM | Updated on Oct 29 2018 8:08 PM

‘వైఎస్సార్ సీపీలో ఉన్నందుకు గర్వపడుతున్నా’ - Sakshi

‘వైఎస్సార్ సీపీలో ఉన్నందుకు గర్వపడుతున్నా’

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నామని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.

హైదరాబాద్‌: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నామని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆవిర్బావ దినోత్సవంతో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా సంక్షేమ పథకాలు అమలు చేశారని ప్రశంసించారు. ఆయనలేని లోటును పూడ్చేందుకు జగనన్న ప్రయత్నిస్తున్నారని చెప్పారు. చిన్నవయసులోనే ఎన్నో పోరాటాలు చేసి ప్రజలకు చేరువయ్యారని అన్నారు.

రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని ఆమె పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధించుకుందామని ప్రతిజ్ఞ చేయించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదుర్కొందామని, ఇంతకుముందు జరిగింది ఒక లెక్క ఇక నుంచి జరగబోయేది మరో లక్క అని పేర్కొన్నారు. జగనన్నను అన్యాయంగా జైలుకు పంపించిన వారిని ఓట్లతో కుల్లబొడుద్దామని ఎమ్మెల్యే రోజా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement