తాగిన మైకంలో ఓ భర్త కట్టుకున్న భార్యను హత్య చేశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా హాలహర్వి మండలం జె.హోసహల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
కర్నూలు (హాలహర్వి) : తాగిన మైకంలో ఓ భర్త కట్టుకున్న భార్యను హత్య చేశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా హాలహర్వి మండలం జె.హోసహల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పార్వతి(35), గాదె లింగప్ప(40)భార్యాభర్తలు. కాగా లింగప్ప రోజూ తాగి వస్తూ భార్యను వేధిస్తుండేవాడు.
ఈ క్రమంలోనే మంగళవారం కూడా తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఆవేశంలో పక్కనున్న కర్ర తీసుకుని భార్య పార్వతి నెత్తి మీద బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.