తూ.గో. జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు | Hudhud Cyclone, Education Institutes, Kakinada, East Godavari, Neetu Kumari Prasad | Sakshi
Sakshi News home page

తూ.గో. జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు

Oct 10 2014 8:47 PM | Updated on Jul 11 2019 5:07 PM

తుఫాన్ తీరం దాటే సమయంలో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతు కుమారి ప్రసాద్ తెలిపారు.

కాకినాడ: తుఫాన్ తీరం దాటే సమయంలో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతు కుమారి ప్రసాద్ తెలిపారు. తుఫాన్ తీవ్ర ఎక్కువగా ఉన్నందున ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కలెక్టర్ సూచించారు. 
 
శనివారం ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజిలకు సెలవు ప్రకటిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. తుఫాన్ బాధితుల కోసం 72 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రేపు సాయంత్రానికి 50 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తామని నీతూ కుమార్ ప్రసాద్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement