బేస్ క్యాంపునకు హెర్నన్ బృందం | Hernan team base camp | Sakshi
Sakshi News home page

బేస్ క్యాంపునకు హెర్నన్ బృందం

Apr 11 2015 1:02 AM | Updated on Jul 26 2018 5:23 PM

బేస్ క్యాంపునకు హెర్నన్ బృందం - Sakshi

బేస్ క్యాంపునకు హెర్నన్ బృందం

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంఘానికి చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు...

  • మస్తాన్‌బాబు మృతదేహాన్ని కిందికి తీసుకొచ్చేందుకు చర్యలు
  • సంగం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంఘానికి చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహాన్ని తెచ్చేందుకు ఆయన స్నేహితుడు హెర్నన్ అగస్టో ప్యారజైన్‌తో పాటు ఆయన బృందం శుక్రవారం అర్ధరాత్రికి బయలుదేరనుంది. ఈ వివరాలను హెర్నన్ బృందం ఫేస్‌బుక్ ద్వారా తెలిపింది. శుక్రవారం ఉదయం(అమెరికా కాలమానం ప్రకారం రాత్రి) బేస్ క్యాంపునకు చేరుకుంటుంది. పది మందితో కూడిన బృందం రెండు జట్లుగా విడిపోయి మృతదేహాన్ని తెచ్చే ప్రక్రియను ప్రారంభించనుంది.
     
    17న మృతదేహం : మల్లి మస్తాన్‌బాబు మృతదేహం ఈ నెల 17వ తేదీన ఆయన స్వగ్రామం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గాంధీజనసంగానికి తీసుకురానున్నట్లు అక్కడి ప్రతినిధులు శుక్రవారం తెలిపారు. మస్తాన్‌బాబు సోదరి డాక్టర్ దొరసానమ్మ శుక్రవారం అర్జెంటీనాకు బయలుదేరి వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement