నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు | Heavy rains in Nellore, Chittoor districts due to cyclone | Sakshi
Sakshi News home page

నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు

Nov 17 2013 12:15 PM | Updated on Oct 20 2018 6:17 PM

బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఆదివారం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఆదివారం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోంగా ఉంది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం పాతపాలెం వద్ద రెండు బోట్లు సముద్రంలో చిక్కుకున్నాయి. అందులో ఉన్న 16 మందిని రక్షించేందుకు కోస్ట్గార్డ్స్ రంగంలోకి దిగారు. సముద్రంలోకి చేపలవేటకు వెళ్ల వద్దని మత్స్యకారులకు అధికారులు సూచించారు.

కృష్ణపట్నం ఓడరేవు వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఎగుర వేశారు. ఇక చిత్తూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల, తిరుపతిలో కుండపోత వర్షం కురిసింది.  కొండచరియలు విరిగిపడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement